గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 21:53:34

ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మెయిల్ అండ్ ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ సర్వీసులతో సహా రెగ్యులర్ టైమ్ టేబుల్ ప్యాసింజర్ సర్వీసులు రద్దు చేయాలని నిర్ణయించినట్లు రైల్వేబోర్డు పేర్కొంది. 2020 జూన్ 30 వరకు ప్రయాణానికి షెడ్యూల్ చేసిన అన్ని రైళ్లను రద్దు చేసి, టికెట్లను రీఫండ్ చేయాలని రైల్వేశాఖ మే 15న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, ఎంపిక చేసిన 230 రైళ్లు నడుస్తాయని వివరించింది. దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండడంతో రైళ్లను రద్దు చేస్తున్నది.


logo