బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 01:21:06

ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

ఆగస్టు 12 వరకు రైళ్లు రద్దు

  • ప్రయాణికులకు టికెట్ల రుసుము వాపస్‌: రైల్వేబోర్డు 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రైల్వేశాఖ ఆగస్టు 12 వరకు రైళ్లను నడుపకూడదని నిర్ణయించింది. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ తదితర అన్ని రెగ్యులర్‌ సర్వీసులను రద్దుచేస్తున్నట్టు రైల్వేబోర్డు గురువారం ప్రకటించింది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అత్యవసర సేవల కోసం ప్రారంభించిన సబర్బన్‌ సర్వీసులు కూడా నడుస్తాయి. తాజా నిర్ణయం నేపథ్యంలో జూలై 1 నుంచి ఆగస్టు 12వరకు జారీ చేసిన టికెట్లను రద్దు చేశారు. టికెట్లు బుక్‌చేసుకున్న వారికి రీఫండ్‌ చేస్తామని రైల్వే బోర్డు పేర్కొంది. 


logo