సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 01:35:34

2023 నాటికి ‘ప్రైవేటు’ పరుగులు

2023 నాటికి ‘ప్రైవేటు’ పరుగులు

  • ఐదు శాతం రైళ్లు మాత్రమే ప్రైవేటుపరం 
  • రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ, జూలై 2: భారతీయ రైల్వేలో మరో మూడేండ్లలో ‘ప్రైవేటు’ కూత వినిపించనున్నది. 2023 ఏప్రిల్‌ నాటికి ప్రైవేటు భాగస్వామ్యంతో ప్యాసింజర్‌ సర్వీసులు నడుస్తాయని రైల్వే వెల్లడించింది. మొత్తం సర్వీసుల్లో కేవలం ఐదు శాతం మాత్రమే ప్రైవేటు కింద నడుస్తాయని పేర్కొంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. టిక్కెట్టు ధరలు కూడా ఆయా రూట్లలో నడిచే విమాన సర్వీసులు, ఏసీ బస్సుల రుసుముకు మధ్య ఉంటాయన్నారు. రైళ్లను నడుపడానికి ప్రైవేటు భాగస్వాముల నుంచి ‘అర్హతకు అభ్యర్థన’ (రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌-ఆర్‌ఎఫ్‌క్యూ)ను ఆహ్వానించడంతో రైల్వే ప్రైవేటు పరం కానున్నదన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై యాదవ్‌ స్పందించారు. రైల్వే కింద 2,800 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయని, ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కేవలం 5% రైళ్లకే పరిమితం అవుతుందన్నారు. 


logo