బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 16:31:18

గడిచిన 15 రోజుల్లో 14 లక్షల మందికి పైగా తరలింపు

గడిచిన 15 రోజుల్లో 14 లక్షల మందికి పైగా తరలింపు

ఢిల్లీ : గడిచిన 15 రోజుల్లో 14 లక్షల మందికి పైగా వారి వారి స్వస్థలాలకు తరలించినట్లు ఇండియన్‌ రైల్వే తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగి విధంచిన లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశానుసారం అదేవిధంగా ఇరు రాష్ర్టాల పరస్పర అంగీకారం అనంతరం మాత్రమే వీరి తరలింపునకు ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1074 ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లు నడిపినట్లు పేర్కొంది. వీటి ద్వారా 14 లక్షల మందికి పైగా స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపింది. 

గడిచిన 3 రోజుల్లో రోజుకు 2 లక్షల మంది చొప్పున తరలించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. అదేవిధంగా రానున్న రోజుల్లో రోజుకు 3 లక్షల ప్రయాణికుల చొప్పున తరలించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, గోవా, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ర్టాల నుంచి ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడిపినట్లు పేర్కొంది.


logo