అగ్ర కథానాయిక సమంత సేవాభావం గురించి అందరికి తెలిసిందే. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వందల మంది పేద బాలబాలికలకు విద్య, వైద్య పరమైన సహకారాన్ని అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటోంది. ఆశ్రితులకు ఆపన్నహస్తాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండే సమంత మరోమారు తన సేవాతత్పరతను చూపించింది. ఆటో నడుపుకొంటూ కుటుంబ భారాన్ని మోయడంతో పాటు తన చెల్లెళ్ల ఆలనాపాలనా చూసుకుంటున్న నారాయణ్‌ఖేడ్‌కు చెందిన కవిత రాథోడ్ అనే మహిళకు సమంత కారును బహుమతిగా అందించి పెద్ద మనసు చాటుకుంది. ‘ఆహా’ ఓటీటీలో సమంత నిర్వహిస్తున్న టాక్‌షో సామ్‌జామ్‌లో పాల్గొన్న కవిత రాథోడ్ తన కష్టాలను చెప్పుకొంది. ఆమె మాటలకు చలించిన సమంత.. కవితకు కారు కొనిచ్చి ఆదుకుంటానని మాటిచ్చింది. చెప్పిన్నట్లుగానే జీవనోపాధి కోసం క్యాబ్కారును బహుమతిగా అందజేసింది. సమంత సేవాగుణానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తనను ఆదుకున్న సమంతకు కవిత రాథోడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.