గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 17:52:48

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు అవకాశాలు

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌  సంస్థలకు అవకాశాలు

న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టే అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్‌ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. త్వరలో అవసరమైన సంస్కరణలు, మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు.  ఇవాళ మీడియా సమావేశంలో నాలుగో ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. 

'ప్రైవేట్‌ సంస్థలతో కలిసి అంతరిక్ష రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయాణం, అంతరిక్ష సేవలు, పరిశోధనల్లో ప్రైవేట్‌ సంస్థల సహకారాన్ని ఉపయోగించుకుంటాం.  ఇస్రో సదుపాయాలు వినియోగించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు అవకాశం లభిస్తుందని' కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  


logo