బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 12:16:50

లేహ్‌లో సైనికుల అద్భుత విన్యాసాలు.. వీడియో

లేహ్‌లో సైనికుల అద్భుత విన్యాసాలు.. వీడియో

జ‌వాన్ ధైర్య‌సాహ‌సాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిలో భాగ‌మైన భార‌త పారాట్రూప‌ర్స్ గురించి మాత్రం చాలామంది తెలిసి ఉండ‌దు. వీరు కూడా ప్ర‌పంచంలో అత్యంత స‌మ‌ర్థ‌వంతులైన వారిలో ఒక‌రు. వీరు దేశం కోసం చేసే త్యాగం ఎన‌లేనిది. దేశం ప‌ట్ల ఉన్న బాధ్య‌తలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే వారు చేసే విన్యాసాలు ఒక‌సారి చూస్తే గుండెల్లో ద‌డ పుట్ట‌డం ఖాయం.

నేల మీదే కాకుండా ఆకాశంలో కూడా చేసే వీరి విన్యాసాలు నోటి మీద వేలేసుకునేలా చేస్తాయి. వీరు ఎక్క‌డైనా రాజులే. ఇన్ని మాట‌లు ఊరికే అన‌డం లేదు. ఈ విన్యాసాలు చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. జులై 17న భారత పారాట్రూపర్లు C-130J హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సైనికులు గాల్లోకి డైవ్ చేసి ఔరా అనిపించారు. ఈ ఎత్తు మాములు ఎత్తు కూడా కాదు. 16 వేల అడుగుల ఎత్తు నుంచి అవ‌లీల‌గా దూకేశారు. లేహ్‌లోని స్తాక్నా మానస్ట్రే నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోనోజ్ ముకుంద్ నరవానే ఈ విన్యాసాలను వీక్షించారు.



logo