గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 12, 2020 , 10:12:32

వ్యానులో నీలిచిత్రాలు చూస్తూ.. జాగింగ్‌కు వచ్చిన మహిళను చూసి రెచ్చిపోయాడు

వ్యానులో నీలిచిత్రాలు చూస్తూ.. జాగింగ్‌కు వచ్చిన మహిళను చూసి రెచ్చిపోయాడు

సింగపూర్ : సింగపూర్‌లో జాగింగ్‌కు వచ్చిన మహిళపై లైంగిక దాడికి యత్నించిన భారత సంతతికి చెందిన 60 ఏండ్ల వృద్ధడికి మంగళవారం నాలుగేళ్ల, మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు మీడియా నివేదిక తెలిపింది.

సింగపూర్‌లో ఫుడ్‌ డెలివరీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న 60 ఏండ్ల కన్నన్‌ సుకుమారన్‌ ఈ ఏడాది మే 12 రాత్రి 7.30 గంటల సమయంలో వ్యాన్ లోపల నీలి చిత్రాలు చూస్తూ కూర్చున్నాడు. ఇదే సమయంలో ఓ 36 ఏండ్ల మహిళ అటువైపు జాగింగ్‌ రావడంతో ఆమెను చూసి సుకుమారన్‌ మరింత రెచ్చిపోయాడు. వెంటనే వ్యాన్‌ దిగి ఆమెను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

ఆ మహిళ ప్రతిఘటించడంతో సుకుమారన్‌ ఆమెను ఛాతీ మీదుగా కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయి సుకుమారన్‌ చేతిని గట్టిగా కొరికి సాయం కోసం కేకలు పెట్టింది. బాధితురాలి అరుపులు విని ఘటనా స్థలానికి మరో మహిళ రావడంతో సుకుమారన్‌ వ్యాన్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. వచ్చిన మహిళ సుకుమారన్‌ వ్యాన్‌ నెంబర్‌ను నోట్‌ చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా పలు వాయిదాల అనంతరం మంగళవారం సింగపూర్‌ న్యాయ శాఖ అతడికి జైలు శిక్ష విధించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo