న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఆదాయం పన్ను (ఐటీ) శాఖ నూతన ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనున్నది. కనుక పన్ను చెల్లింపు దారులు రొటీన్ ఐటీఆర్ దాఖలు, ఇతర పన్నేతర పనులకు నూతన ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్‌ను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తమ యూనిట్లన్నింటికి ఆదాయం పన్ను శాఖ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
జూన్ ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ప్రస్తుతం పని చేస్తున్న ఐటీశాఖ వెబ్సైట్ అందుబాటులో ఉండదని తెలిపింది. నూతన సిస్టమ్‌లోకి బదిలీ ప్రయత్నాల్లో భాగంగా జూన్ 1-6 తేదీల మధ్య పన్ను చెల్లింపుదారులకు, ఐటీ అధికారులకు ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉండదు.
ఈ మేరకు శాఖ సిస్టమ్స్ వింగ్ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పాత వెబ్ సైట్ www.incometaxindia efiling.gov.in నుంచి నూతన www.incometaxgov.inకు మారడానికి సమయం పడుతుందని, జూన్ ఏడో తేదీన ప్రారంభం అవుతుందని తెలిపింది.
కనుక ఐటీ అధికారులంతా.. పన్ను చెల్లింపు దారుల అభ్యర్థనలు, ఫిర్యాదులను జూన్ 10వ తేదీ నుంచి స్వీకరించాలని ఆ ఆదేశాల్లో వెల్లడించింది. వచ్చే నెల 10వ తేదీ తర్వాతే నూతన సిస్టమ్‌లో పన్ను చెల్లింపుదారులతో స్పందించేందుకు వీలవుతుందని తెలిపింది.
పన్ను చెల్లింపు దారుడు-ఐటీ మదింపు అధికారి మధ్య ఎటువంటి వర్క్ ఉన్నా, ఈ నెలాఖరులోపు ముందుకు జరుపుకోవడం గానీ, వచ్చే నెల 10వ తర్వాత వాయిదా వేయడం గానీ చేయాలని ఐటీ శాఖ సూచించింది.
ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ఆదాయం పన్ను చెల్లింపులు జరిపేందుకు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు పన్ను చెల్లింపుదారులు ఉపయోగించాలని తెలిపింది. వెబ్‌సైట్‌లోని ఈ-ప్రొసీడింగ్స్ పన్ను చెల్లింపు దారుల అప్పీళ్లపై ఆదాయ మదింపు అధికారులతోపాటు చీఫ్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్స్, ఇన్‌కం టాక్స్ ముఖ్య కమిషనర్ సంప్రదింపులు జరుపాలని సూచించింది.
పన్ను చెల్లింపు దారులకు నోటీసులు జారీ చేయడానికి, వాటిపై స్పందన తెలుసుకోవడానికి ఐటీ అధికారులు నూతన వెబ్‌సైట్‌నే వాడాలని పేర్కొంది.
ఈ వెబ్సైట్ కేంద్రంగానే ఆదాయంపై పన్ను మదింపు, అప్పీళ్లు, మినహాయింపులు, పెనాల్టీలు, ఇతర అంశాలపై పన్ను చెల్లింపు దారుల సందేహాలను వెల్లడించాలన్నది. వాటికి అధికారులు కూడా దీని ద్వారానే జవాబివ్వాలని స్పష్టం చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!