శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 18:02:43

భారత్‌, ఆస్ట్రేలియా నౌకా విన్యాసాలు షురూ

భారత్‌, ఆస్ట్రేలియా నౌకా విన్యాసాలు షురూ

న్యూఢిల్లీ: భారత్‌, ఆస్ట్రేలియా కలిసి నౌకా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇండియన్ నేవీ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ పాసేజ్ ఎక్సర్సైజ్ (పాసెక్స్) పేరుతో తూర్పు హిందూ మహా సముద్రంలో వీటిని జరుపుతున్నాయి. ఆస్ట్రేలియా ఎయిర్ వార్ఫేర్ డిస్ట్రాయర్ హెచ్‌ఎంఏఎస్‌ హోబర్ట్, భారత్‌కు చెందిన స్టీల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, క్షిపణి కొర్వెట్టి ఐఎన్‌ఎస్‌ కార్ముక్ ఈ మారిటైమ్‌ విన్యాసాల్లో పాల్గొన్నట్లు భారత నావికాదళం తెలిపింది. లఢక్‌ సరిహద్దులో చైనాతోఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్‌, ఆస్ట్రేలియా సంయుక్తంగా నౌకా విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి