గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 09, 2020 , 02:34:55

విదేశాలకూ మన మీడియా!

విదేశాలకూ మన మీడియా!

  • మన గళాన్ని ప్రపంచం వింటున్నది 
  • దేశదేశాలకు మీడియా విస్తరించాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచంలో మన దేశ ఉత్పత్తులేగాక, మన గొంతుక (మీడియా) కూడా ప్రాచుర్యం పొందుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ గళాన్ని యావత్‌ ప్రపంచం శ్రద్ధగా వింటున్నదని చెప్పారు. ఈ డిజిటల్‌ యుగంలో భారత మీడియా ప్రపంచం నలుమూలలకు విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ప్రముఖ మీడియాసంస్థ ‘పత్రిక గ్రూప్‌'.. పత్రిక గేట్‌ పేరుతో పర్యాటకులకు కనువిందు చేసే ఒక ద్వారాన్ని నిర్మించింది. దీనిని మంగళవారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీంతోపాటు పత్రికా గ్రూప్‌ చైర్మన్‌ గులాబ్‌ కొఠారీ రచించిన సంవాద్‌ ఉపనిషత్‌, అక్షర్‌యాత్ర అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత మీడియాను ప్రశంసించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా ముఖ్య భూమిక పోషించిందన్నారు.