శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:02:08

భారత గణితశాస్ర్త నాయకుడు, పద్మ భూషణ్ సీఎస్‌ శేషాద్రి కన్నుమూత

భారత గణితశాస్ర్త నాయకుడు, పద్మ భూషణ్ సీఎస్‌ శేషాద్రి కన్నుమూత

చెన్నై : స్వాతంత్య్రానంతరం భారత గణిత శాస్త్ర నాయకుల్లో ఒకరైన సీఎస్‌ శేషాద్రి (88) శుక్రవారం (జూలై 17న) చెన్నైలో మృతి చెందారు.  బీజగణిత జ్యామితి రంగంలో నాయకుడైన శేషాద్రి క్రమశిక్షణతో అనేక శాఖల్లో పురోగతిని సాధించారు. శేషాద్రి టాషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో ఒకరిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అతను 1984లో చెన్నైకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌కు వెళ్లాడు. 1989లో చెన్నై గణితగ సంస్థ (సీఎంఐ)గా పరిణామం చెందిన ఎస్‌పీఐసీ సైన్స్ ఫౌండేషన్‌లో భాగంగా స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రారంభించే అవకాశం అతడికి లభించింది. శేషాద్రి 1988లో రాయల్ సొసైటీ ఫెలోగా, 2010 లో యూఎస్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విదేశీ అసోసియేట్‌గా ఎన్నికయ్యాడు. 2009లో అతడికి పద్మ భూషణ్ అవార్డు కూడా లభించింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo