e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!

పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!

పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!

భువ‌నేశ్వ‌ర్‌: పాముకు పాలు పోసి పెంచితే ఎప్ప‌టికైనా ప్రాణం తీస్తుందంటారు. కానీ ఓ యువ‌కుడు మాత్రం ఏకంగా అపస్మార‌క స్థితిలో ఉన్న‌ పాము నోట్లో నోరు పెట్టి ఊపిరే ఊదాడు. అయితే ఇక్క‌డ పాము ఆ యువ‌కుడి ప్రాణాలు తీయ‌లేదు. కానీ ఆ యువ‌కుడు మాత్రం చావుబ‌తుకుల్లో ఉన్న పాముకు ప్రాణం పోశాడు. ఒడిశా రాష్ట్రం మ‌ల్క‌న్‌గిరి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. త‌న దారిన తాను వెళ్తున్న ఓ యువ‌కుడికి దారి వెంట అప‌స్మార‌క స్థితిలో ఒక‌ పాము క‌నిపించింది. ఆ పాముకు శ్వాస అంద‌డంలేద‌ని గ‌మ‌నించి ఓ స్ట్రా సాయంతో దాని నోట్లోకి ఊపిరి ఊద‌డం మొద‌లుపెట్టాడు. ఇది చూసి స్థానికులు చాలామంది అక్క‌డ గుమిగూడారు. యువ‌కుడు దాదాపు 15 నిమిషాలు శ్ర‌మించిన త‌ర్వాత పాము స్పృహ‌లోకి వ‌చ్చింది.

- Advertisement -

అది చూసి స‌దరు యువ‌కుడితోపాటు అక్కడ పోగైన‌ జ‌నం కూడా సంతోషించారు. అనంత‌రం ఆ పామును స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!
పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!
పాము నోట్లోకి ఊపిరి ఊదిన యువ‌కుడు..!

ట్రెండింగ్‌

Advertisement