శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 13:06:57

అరుణాచ‌ల్‌ స‌రిహ‌ద్దుల్లో చైనా ఆర్మీ.. గుర్తించిన ఇస్రో శాటిలైట్‌

అరుణాచ‌ల్‌ స‌రిహ‌ద్దుల్లో చైనా ఆర్మీ.. గుర్తించిన ఇస్రో శాటిలైట్‌

హైద‌రాబాద్‌: చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో.. భార‌త్‌కు చెందిన ఎమిశాట్ శాటిలైట్ కీల‌క ఆధారాల‌ను సేక‌రించింది.  భార‌తీయ నిఘా ఉప‌గ్ర‌హంగా గుర్తింపు పొందిన ఎమిశాట్‌.. పీఎల్ఏ ద‌ళాల క‌దలిక‌ల‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తున్న‌ది. ఎమిశాట్ శాటిలైట్‌లో ఉన్న కౌటిల్యను.. డీఆర్‌డీవో ఆప‌రేట్ చేస్తున్న‌ది.  ఎల‌క్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ప్యాకేజ్‌గా కౌటిల్య అనేక ర‌హ‌స్య అంశాల‌ను వెల్ల‌డించింది. టిబెట్ స‌మీపంలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దులో చైనా ద‌ళాల గురించి కౌటిల్య ట్రాక్ చేసింది. 

ఎమిశాటిలైట్ బ‌రువు 436 కేజీలు. పీఎస్ఎల్వీ-సీ45 ద్వారా గ‌త ఏడాది ఏప్రిల్ 10వ తేదీన క‌క్ష్యలోకి ప్ర‌వేశ‌పెట్టారు. ఎల‌క్ట్రానిక్ స్పెక్ట్ర‌మ్ నిఘా ఉద్దేశంతో దీన్ని ప్ర‌యోగించారు.  ఇది దేశానికి చెందిన తొట్ట‌తొలి ఎల‌క్ట్రానిక్ నిఘా ఉప‌గ‌హ్రం. ఇస్రో, డీఆర్‌డీవోలు సంయుక్తంగా అత్యంత శ‌క్తివంత‌మైన ఈ ఉప‌గ్ర‌హాన్ని డెవ‌ల‌ప్ చేశాయి.  సైనిక ద‌ళాల‌కు ఈ శాటిలైట్ కీల‌క స‌మాచారాన్ని చేర‌వేయ‌గ‌ల‌దు. స‌రిహ‌ద్దుల్లో శ‌త్రు దేశాల రేడార్ల గురించి కూడా ఇది చెప్ప‌గ‌ల‌దు.  ప్రాజెక్టు కౌటిల్య గురించి 2013-14 ర‌క్ష‌ణ నివేదిక‌లో తెలిపారు. 

 


logo