ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 10:50:13

మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీపై కేంద్రం క‌స‌ర‌త్తు

మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీపై కేంద్రం క‌స‌ర‌త్తు

హైద‌రాబాద్‌:  కోవిడ్ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి భారీ ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి.  కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భూష‌న్ పాండే ఈ విష‌యాన్ని తెలిపారు.  అయితే ఆ ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌పై ఆయ‌న ఎటువంటి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. కానీ ఉద్దీప‌న ప్యాకేజీకి సంబంధించి ప‌రిశీల‌న జ‌రుగుతోంద‌ని, ఎక్క‌డ ఎవ‌రికి ఏం అవ‌స‌రం ఉందో తెలుసుకుని ప్యాకేజీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  వ్యాపార‌వేత్త‌లు, వాణిజ్య సంఘాలు, వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌తో ఈ అంశంపై సంప్ర‌దిస్తున్నామ‌ని, దాని ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అజ‌య్ భూష‌న్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకుంటోంద‌ని, అది సుస్థిర అభివృద్ధి దిశ‌గా సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు.  అక్టోబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లు 105,155 కోట్లు వ‌చ్చింద‌ని, సెప్టెంబ‌ర్‌లో జీఎస్టీ వ‌సూళ్లులో నాలుగ శాతం వృద్ధి ఉంద‌ని, విద్యుత్తు వినియోగం, ఎగుమ‌తులు, దిగుమ‌తులు పెరిగిన‌ట్లు అజ‌య్ చెప్పారు.  సెప్టెబ‌ర్‌, ఆక్టోబ‌ర్ డేటాను ప‌రిశీలిస్తే, మ‌నం ప్రీకోవిడ్ ద‌శ‌లోకి వెళ్లిన‌ట్లుగా ఉంద‌న్నారు.  ఈ-బిల్లుల‌ను ప‌రిశీలిస్తే.. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌తో పోలిస్తే ఈ ఏడాదిలో 10 శాతం పెరుగుద‌ల క‌నిపించింద‌న్నారు.  ఇక అది అక్టోబ‌ర్‌లో 21 శాతం ఉంద‌న్నారు.  ఒక‌వేళ రానున్న అయిదు నెల‌లు ఇలాగే కొన‌సాగితే అప్పుడు మార్చి నాటికి జీరో స్థాయికి వ‌స్తామ‌న్నారు.