శుక్రవారం 03 జూలై 2020
National - Jun 27, 2020 , 16:44:43

రైతులకు భారత ప్రభుత్వం సాయమందించాలి : రాహుల్‌ గాంధీ

రైతులకు భారత ప్రభుత్వం సాయమందించాలి : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్తాన్‌, పంజాబ్‌ ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలలోని పంట పొలాలపై మిడతల దండు దండెత్తింది. ఆయా ప్రాంత అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మిడతలను తరమాలని రైతులకు సూచించారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ స్పందించారు.

‘హర్యానా, రాజస్తాన్‌, పంజాబ్‌, ఉత్తప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ర్టలో మిడతలు పంటలను నాశనం చేశాయి. ఈ దాడులను ఎదురుకున్న రాష్ట్రాలు, ఆయా ప్రాంత రైతులకు భారత ప్రభుత్వం తప్పక సాయం అందించాలి’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు.   logo