శనివారం 30 మే 2020
National - Mar 28, 2020 , 12:52:16

క‌రోనా ఎఫెక్ట్‌: ఆర్మీ క‌మాండ‌ర్ల‌కు అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాలు

క‌రోనా ఎఫెక్ట్‌: ఆర్మీ క‌మాండ‌ర్ల‌కు అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాలు

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభన‌, దేశంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం కొన‌సాగ‌తున్న లాక్‌డౌన్ లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నది. ఆర్మీ క‌మాండ‌ర్లు, కార్ప్స్ క‌మాండ‌ర్లు, ఏరియా క‌మాండ‌ర్లు, స‌బ్ ఏరియా క‌మాండ‌ర్ల‌కు అత్య‌వ‌స‌ర ఆర్థిక అధికారాల‌ను క‌ట్ట‌బెడుతూ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఉత్త‌ర్వులు జారీచేసింది. క‌రోనా బాధితుల కోసం ఐసోలేష‌న్ కేంద్రాల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ‌.. ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ క‌ల్ప‌నకు ఆర్మీ క‌మాండ‌ర్లు త‌మ ప‌రిధిలోని నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది. 

అయితే, క‌మాండ‌ర్ల‌ హోదానుబ‌ట్టి ఖ‌ర్చుచేసే స్థాయిల‌పై కేంద్రం ప‌రిమితులు విధించింది. ఆర్మీ క‌మాండ‌ర్ల‌కు ఫుల్ ఫైనాన్షియ‌ల్ ప‌వ‌ర్స్ ఇవ్వ‌గా.. కార్ప్స్ క‌మాండ‌ర్లు, ఏరియా క‌మాండ‌ర్లు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసే అధికారం క‌ట్ట‌బెట్టింది. ఇక స‌బ్ ఏరియా క‌మాండ‌ర్ల‌కు రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసే అధికారం ఇచ్చింది. ఈ మేర‌కు ర‌క్ష‌ణ బ‌డ్జెట్ నుంచి నిధుల‌ను వాడుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

ఐసోలేష‌న్ కేంద్రాల ఏర్పాటుతోపాటు వాటి నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు, బాధితుల ఆక‌లి తీర్చ‌డానికి కావాల్సిన‌ బియ్యం, ఇత‌ర సామాగ్రి వంటి వాటిని స‌మ‌కూర్చ‌డానికి ఆర్మీ క‌మాండ‌ర్లు నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. కాగా, మార్చి 27 నుంచి మూడు నెల‌ల పాటు ఆర్మీ క‌మాండ‌ర్లు ఈ అధికారాల‌ను క‌లిగి ఉంటార‌ని ర‌క్ష‌ణ శాఖ్ స్ప‌ష్టం చేసింది.  

  


logo