శనివారం 11 జూలై 2020
National - Jun 27, 2020 , 11:26:32

కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వానికి ప్రణాళిక లేదు : రాహుల్‌ గాంధీ

కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వానికి ప్రణాళిక లేదు : రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు గాల్వన్‌ లోయలో జరిగిన ఘటనపై వివరాలు కోరుతూ ప్రశ్నలు సంధించిన రాహుల్‌.. నేడు వేగంగా వ్యాపిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని మండిపడ్డారు.  ‘దేశంలో కొత్త ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది’ అని రాహుల్‌ గాంధీ ట్విట్‌ చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. ప్రధాని మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. logo