డెట్రాయిట్: అమెరికాలో ఓ భారీ చేప పట్టుబడింది. దాని బరువు మాత్రమే కాదు.. దాని వయసు కూడా ఓ రికార్డే. వందేళ్లకుపైగా వయసున్న ఆ చేప 7 అడుగుల పొడవుంది. బరువు సుమారు 108 కిలోలు. డెట్రాయిట్ నదిలో దొరికిన ఆ చేప ఆడదని గుర్తించారు. అమెరికా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్ సంస్థ ఈ ఫొటోను విడుదల చేసింది. చేప సైజు ఆకారం మీద అవగాహన రావడానికి దానిపక్కన సంస్థ సిబ్బంది ఒకరు పడుకుని ఫొటో దిగారు. కొలతలు తీసుకున్న తర్వాత తిరిగి చేపను నీటిలో వదిలారు. లావు, ాకారాన్ని బట్టి చేపను ఆడదని గుర్తించారు. అది స్టర్జన్ జాతికి చెందిన చేప. మగ చేప అయితే సుమారు 55 ఏళ్లు బతుకుంది. ఆడచేప 70 నుంచి వందేళ్లు బతుకుతుంది. డెట్రాయిట్ నదిలో పట్టుబడిన చేప మాత్రం వందేళ్లకు పైగా నీళ్లలో మనుగడ సాగిస్తున్నట్టు అంచనా వేశారు. దానిని పట్టుకునేందుకు రౌండ్ గోబీ అనే చేపను ఎరగా వేశారట. డెట్రాయిట్కు దక్షిణంగా గ్రోస్ ఐస్ సమీపంలో అది ఏప్రిల్ 22న పట్టుబడింది. ఫేస్బుక్లో చేప ఫొటో పెడితే 24 వేల షేర్లు వచ్చాయి.