శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 12:38:53

నకిలీ వార్తలను నిరోధించాలి..!

నకిలీ వార్తలను నిరోధించాలి..!

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై నకిలీ వార్తలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా వేదికలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశంలో రోజురోజుకు కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురి కాకుండా ఉండేందుకు తప్పుడు వార్తలు వ్యాపించకుండా బాధ్యత తీసుకోవాలని ఆయా సంస్థలకు సూచించింది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియా వేదికలు తమ వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు పూనుకోవాలని కేంద్రం అభ్యర్థించింది. అలాగే తప్పుడు సమాచారాన్ని నిలిపివేసేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని, సరైన సమాచారం వ్యాప్తికి చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియా సంస్థలను కోరింది.logo