బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 01:26:52

దుబాయ్‌లోని భారతీయ బాలికకు వైరస్‌

దుబాయ్‌లోని భారతీయ బాలికకు వైరస్‌

అబుదాబి: దుబాయ్‌లో నివసిస్తున్న 16 ఏండ్ల భారతీయ బాలికకు కరోనా సోకింది. ఆమె తండ్రి ఐదు రోజుల కిందటే విదేశాల నుంచి తిరిగి వచ్చినట్టు గుర్తించారు. ఆయన ద్వారా బాలికకు వైరస్‌ సోకిందని అధికారులు భావిస్తున్నారు. బాలికతోపాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షిస్తున్నారు. ఆ బాలిక ప్రస్తుతం దుబాయ్‌లోని ‘ఇండియన్‌ హైస్కూల్‌'లో చదువుతున్నదన్నారు. ముందస్తు చర్యగా గురువారం నుంచి ఆ సంస్థకు చెందిన పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.


logo
>>>>>>