న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ లేదా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నుంచి కొత్త కనెక్షన్ కావాలా.. అయితే 84549 55555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇండేన్ గ్యాస్ ప్రతినిధులు కనెక్షన్ ఇచ్చిపోతారు. ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారమే ఈ నంబర్‌ను ప్రారంభించారు. దేశంలో ఎక్కడైనా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారు సిలిండర్ రీఫిల్ చేసుకోవాలన్నా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కే మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. దీంతో పాటు డబుల్ బాటిల్ కనెక్షన్(డీబీసీ)ను కూడా ప్రారంభించారు. దీనికింద 14.2 కిలోల సిలిండర్‌తో పాటు అదనంగా 5 కిలోల సిలిండర్‌ను కూడా బ్యాకప్ కింద నిల్వ చేసుకోవచ్చు.