గురువారం 26 నవంబర్ 2020
National - Nov 10, 2020 , 15:57:47

సంక్లిష్టమైన వాతావరణంలో భారత దళాలు : సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌

సంక్లిష్టమైన వాతావరణంలో భారత దళాలు : సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌

న్యూఢిల్లీ : భారత సైనిక దళాలు చాలా సంక్లిష్టమైన, అనిశ్చిత వాతావరణంలో పని చేస్తున్నాయని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. రక్షణ, సైనిక అంశాలపై పోర్టల్‌ అయిన భారత్‌శక్తి వెబ్‌సైట్‌ (Bharatshakti.in) ఐదో వార్షికోత్సవ సదస్సు ప్రారంభ సమావేశంలో సీడీఎస్‌ ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ చిన్న, పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయని, అందువల్ల మనమందరం మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మన జాతిని కాపాడుకోవాలని, మన దేశ సమగ్రతను, ప్రజల భద్రతను కాపాడాలని రావత్‌ పేర్కొన్నారు. 

అయితే సాయుధ దళాలు యుద్ధానికి సిద్ధం కావాలని అంటున్నామా అంటే కాదని, ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావడానికి సాయుధ దళాలు సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, బలమైన సాయుధ బలగాలు లేకపోతే శత్రువు అవకాశాన్ని తీసుకుంటాడన్నారు. తూర్పు లడఖ్‌లో భారత్‌-చైనా మధ్య ఆరు నెలల పాటు సరిహద్దు వివాదం నేపథ్యంలో జనరల్‌ రావత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరుదేశాలు ఇప్పటి వరకు వరుస దౌత్య, సైనిక చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించాయి. అయితే ప్రతిష్టంభనను ముగించడానికి ఎలాంటి స్పష్టమైన పురోగతి సాధించలేదు.

ఆరువేల నుంచి 6500 మీటర్ల ఎత్తు వరకు ఉన్న అడవులు, ఎడారులు భూభాగాలతో సహా క్లిష్టమైన సవాళ్లలో పని చేస్తున్న సాయుధ దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీడీఎస్‌ మాట్లాడారు. ‘మా నౌకాదళం ఇండో-పసిఫిక్‌లో పని చేస్తుందని,  ఇది వైట్ షిప్పింగ్ అత్యధిక కేంద్రీకరణకు సాక్ష్యంగా ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న సంక్లిష్ట వాతావరణంలో ఉపరితలంపై మాత్రమే కాకుండా సముద్రం కింద కూడా సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్‌ భదౌరియా మాట్లాడుతూ భారత్‌కు ప్రత్యర్థుల ముప్పు ‘లోతైన, దీర్ఘకాలికమైనది’ అన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.