బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 15:21:17

20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎవరికెంత?.. కాసేపట్లో క్లారిటీ

20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఎవరికెంత?.. కాసేపట్లో క్లారిటీ

హైదరాబాద్‌ : భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ. 20 లక్షల కోట్లపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది. ఈ ప్యాకేజీలో ఎవరికెంతనేది తేలనుంది. మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌ వెల్లడించనున్నారు.  దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  పరిశ్రమలకు, మధ్యతరగతికి, రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారోననే ఆసక్తి నెలకొంది. అయితే.. ఇది నిజంగానే ఉద్దీపన ప్యాకేజీయా?.. లేక బడ్జెట్‌లో చెప్పినవాటికి కొన్ని యాడ్‌ చేశారా?.. అనే విషయాలపై కూడా స్ఫష్టత రానుంది.logo