శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 16:58:48

రష్యాలో భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన రాజ్‌నాథ్‌

రష్యాలో భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన రాజ్‌నాథ్‌

మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాస్కోలోని భారత రాయబార కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఆ కార్యాలయం భవనం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాస్కోలో ఇరు దేశాల రక్షణ శాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ రక్షణ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ రష్యా ఉప రక్షణ మంత్రి కర్నల్‌ జనరల్‌ అలెగ్జాండర్ వాసిలీవిచ్ ఫోమిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. logo