బుధవారం 03 జూన్ 2020
National - May 21, 2020 , 00:49:51

చైనా, ఇటలీ కంటే భారత్‌ వైరసే ప్రాణాంతకం: నేపాల్‌

చైనా, ఇటలీ కంటే భారత్‌ వైరసే ప్రాణాంతకం: నేపాల్‌

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు భూభాగాలను తమ ప్రాంతాలుగా పేర్కొంటూ మంగళవారం కొత్త మ్యాప్‌ను రూపొందించిన నేపాల్‌.. తాజాగా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి ఇండియానే కారణమని నిందిస్తూ.. చైనా, ఇటలీ కంటే భారత్‌ వైరసే అత్యంత ప్రాణాంతకంగా కనిపిస్తున్నదని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి అక్రమంగా వస్తున్న వారి వల్లే దేశంలో కేసులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. భారత్‌లో అంతర్భాగమైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమ దేశానివిగా చూపుతూ రూపొందించిన కొత్త మ్యాప్‌ను నేపాల్‌ బుధవారం విడుదల చేసింది. ఈ ప్రాంతాలను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా తిరిగి సొంతం చేసుకుంటామంటూ ఓలీ వ్యాఖ్యానించారు. అయితే నేపాల్‌ నిర్ణయంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నేపాల్‌ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని స్పష్టంచేసింది. ఇలాంటి న్యాయవిరుద్ధమైన కార్టోగ్రాఫిక్‌ ప్రకటనలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికింది.  


logo