ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 08, 2020 , 18:19:41

ఎన్‌ 100 మాస్క్‌.. ఇది గాలిని 99.97% ఫిల్టర్‌ చేస్తుంది..!

ఎన్‌ 100 మాస్క్‌.. ఇది గాలిని 99.97% ఫిల్టర్‌ చేస్తుంది..!

ముంబై: ఇప్పటి దాకా మనకు ఎన్‌ 95 మాస్క్‌ ఉత్తమమైనదిగా తెలుసు.. అయితే, ఇప్పుడు మార్కెట్లోకి గాలిని 99.97% ఫిల్టర్‌ చేసే ఎన్‌ 100 మాస్క్‌ రాబోతున్నది. దీనిని ఎక్సెల్ 3 డీ అడ్వాన్స్ టెక్నాలజీ అనే సంస్థ తయారు చేసింది. ముంబైకి చెందిన సమిత్ రౌత్, అతడి లండన్ భాగస్వామి డాక్టర్ రాహుల్ గోరే ఈ మాస్కును అభివృద్ధి చేశారు. వైద్యులు, నర్సులులాంటి ఫ్రంట్‌లైన్‌ వారియర్లను  దృష్టిలో ఉంచుకుని వీరిద్దరూ దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి ‘ఎక్స్‌డీ 100’ అని పేరుపెట్టారు. ఇలాంటి మాస్కులను ప్రపంచంలోనే ఇప్పటివరకూ  9 కంపెనీలు మాత్రమే తయారుచేస్తున్నాయి.  

‘మేం 3 డీ ప్రింటింగ్ వ్యాపారంలో ఉన్నాం, కానీ ఈ మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు సహాయపడే ఎన్‌95 మాస్క్ కంటే చాలా ఉత్తమమైనది తయారుచేయాలనుకున్నాం.  ఎన్‌100 మాస్కులు తయారు చేసే కంపెనీలు భారత్‌లో లేవు.’ అని సమిత్ రౌత్ తెలిపారు. దీనిని రూపొందించేందుకు నాలుగు నెలలు పట్టిందని వెల్లడించారు. ఒక్కో మాస్కు ధర రూ .1200 ఉంటుందని తెలిపారు. అనుమతులు లభించగానే మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo