సోమవారం 18 జనవరి 2021
National - Jan 11, 2021 , 11:31:49

మ‌త్స్యకారుల ప‌డ‌వ‌లో అగ్నిప్ర‌మాదం.. 11 మందిని ర‌క్షించిన ICG

మ‌త్స్యకారుల ప‌డ‌వ‌లో అగ్నిప్ర‌మాదం.. 11 మందిని ర‌క్షించిన ICG

న్యూఢిల్లీ: అరేబియా స‌ముద్రంలో ఓ మ‌త్స్యకారుల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు తీరానికి ప‌శ్చిమంగా 140 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోటులోని సిలిండ‌ర్ పేల‌డంతో మంట‌లు వ్యాపించాయి. ప్ర‌మాదంలో ఒక మ‌త్స్య‌కారుడికి తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే తీర ర‌క్ష‌క ద‌ళం (ఇండియ‌న్ కోస్ట్‌గార్డ్‌-ICG) బృందాలు అక్క‌డికి చేరుకుని 11 మంది మ‌త్స‌కారులను ర‌క్షించారు. 

త‌మిళ‌నాడుకు చెందిన 11 మంది మ‌త్స్య‌కారులు ఇటీవ‌ల‌ At 1115h, CG డార్నియ‌ర్ బోటులో అరేబియా స‌ముద్రంలో చేప‌ల‌ వేట‌కు వెళ్లారు. అయితే ఆదివారం తెల్లవారుజామున బోటులోని సిలిండ‌ర్ పేల‌డంతో మంట‌లు అంటుకున్నాయి. దాంతో బోటులోని మ‌త్స్యకారులు ముంబైలోని మ్యారీటైమ్ రెస్క్యూ కో ఆర్డినేష‌న్ సెంట‌ర్‌కు స‌మాచారం అందించారు. దాంతో వెంట‌నే రంగంలోకి దిగిన ICG.. 11 మంది మ‌త్స్య‌కారుల‌ను కాపాడి తీరానికి చేర్చింది. తీవ్రంగా గాయ‌ప‌డి మ‌త్స్యకారుడిని ఆస్ప‌త్రిలో చేర్చింది.  

    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.