మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 06:48:33

15 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ

15 మంది మత్స్యకారులను రక్షించిన నేవీ

కోల్‌కతా: బంగాళఖాతంలో చిక్కుకుపోయిన 15 మంది మత్స్యకారులను ఇండియన్‌ కోస్ట్‌ గార్డు (ఐసీజీ) సిబ్బంది రక్షించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందినవారుగా అధికారులు వెల్లడించారు. గస్తీ నిర్వహణలో భాగంగా ఉత్తర బంగాళాఖాతంలో మోహరించిన ఐసీజీ నౌక విజయకు ‘కృష్ణ కన్య’ అనే మత్స్యకారుల పడవ నుంచి రక్షించాల్సిందిగా అత్యవసర ఫోన్‌ వచ్చిందని, దీంతో పడవలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించామని కమాండ్‌ ఆఫ్‌ డీఐజీ విజయ్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు, తమ ప్రాదేశిక జలాల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు శ్రీలంక నేవీ వెల్లడించింది. ఇందులో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు తెలిపింది. 


logo