సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 11:02:58

యూఎన్‌లో అర్చ‌నా సోరెంగ్‌కు అరుదైన గుర్తింపు..

యూఎన్‌లో అర్చ‌నా సోరెంగ్‌కు అరుదైన గుర్తింపు..

హైద‌రాబాద్‌: వాతావ‌ర‌ణ మార్పుల‌పై ఐక్యరాజ్య‌స‌మితి ఏర్పాటు చేసిన అడ్వైజ‌రీ గ్రూపులో భార‌తీయ మ‌హిళ అర్చ‌నా సోరెంగ్‌కు అవ‌కాశం ద‌క్కింది.  స‌ల‌హా స‌భ్యుల్లో అర్చ‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నట్లు‌ ఐక్య‌రాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు. కోవిడ్‌19 అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, దానికి కావాల్సిన స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను డ్వైజ‌రీ గ్రూపు ఇవ్వ‌నున్న‌ది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం ఆరుగురు యువ నేత‌ల్ని దీని కోసం ఎంపిక చేశారు. ఆ జాబితాలో భార‌తీయ కార్య‌క‌ర్త అర్చ‌నా సోరెంగ్ కూడా ఉన్నారు.  

ప‌రిశోధ‌నా, న్యాయ‌వాద రంగంలో సోరెంగ్‌కు అనుభ‌వం ఉన్న‌ద‌ని, సాంప్ర‌దాయ జ్ఞానాన్ని ప‌రిర‌క్షించ‌డంలో, ప్ర‌మోట్ చేయ‌డంలో కృషి చేస్తున్న‌ట్లు యూఎన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  మ‌న పూర్వీకులు వారికి ఉన్న సాంప్ర‌దాయ జ్ఞానంతో అడ‌వుల‌ను, ప్ర‌కృతిని ర‌క్షించార‌ని, ఇప్పుడు వాతావ‌ర‌ణ మార్పుల‌ను ఎదుర్కొనేందుకు మనం కూడా ముందు ఉండి న‌డిపించాల‌ని అర్చ‌నా సోరెంగ్ తెలిపారు. ముంబైలో ఉన్న టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌లో ఆమె చ‌దువుకున్నారు. టీఐఎస్ఎస్ స్టూడెంట్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌గా కూడా చేసిందామె. 

అడ్వైజ‌రీ గ్రూపుకు ఎంపికైన వారిలో నిస్రీన్ ఎల్‌సైమ్‌(సుడాన్‌), ఎర్నెస్ట్ గిబ్స‌న్‌(ఫిజి), వాదిస్ల‌వ్ కైమ్‌(మోల్డోవా), సోఫియా కియ‌న్ని(యూఎస్‌), నాథ‌న్ మీట‌నైర్‌(ఫ్రాన్స్‌), ప‌లోమా కోస్టా(బ్రెజిల్‌) ఉన్నారు.  logo