బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 16:40:46

కన్నడ పరుగుల వీరుడిని ట్రయల్స్‌కు పిలుస్తాం..

కన్నడ పరుగుల వీరుడిని ట్రయల్స్‌కు పిలుస్తాం..

న్యూఢిల్లీ:  కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని కర్ణాటకకు చెందిన శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తిన వీడియో  ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.  దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని శ్రీనివాస అత్యంత వేగంగా 13.62 సెకన్లలో పరుగెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 100 మీటర్ల పరుగులో జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు(9.58సెకన్లు)ను సైతం బ్రేక్‌ చేశాడు.  ఐతే అతడికి సరైన శిక్షణ ఇచ్చి భారత్‌ తరఫున పరుగు పందెం పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని ట్వీట్లు చేస్తున్నారు. శ్రీనివాస గౌడ ఏకంగా కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు  దృష్టిని ఆకర్షించారు. 

'టాప్‌ సాయ్‌(SAI) కోచ్‌ల పర్యవేక్షణలో ట్రయల్స్‌ కోసం శ్రీనివాస గౌడను  పిలుస్తాను. ఒలింపిక్స్‌ ప్రమాణాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు.  ప్రత్యేకించి అథ్లెటిక్స్‌లో  శారీరక దృఢత్వం,  సహనం విజయం సాధిస్తాయి. దేశంలో టాలెంట్‌  అనేది నిరూపయోగంగా ఉండకూడదు' అని రిజుజు  చెప్పారు.

శ్రీనివాస గౌడకు బంగారు పతకం ఇవ్వాలని  పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కోరారు.' అథ్లెటిక్స్‌లో విజయం సాధించే ద్భుత సామర్థ్యం అతడికి ఉంది. 100మీటర్ల పరుగు పందెంలో అతనికి శిక్షణ ఇచ్చేలా రిజుజు ప్రత్యేక దృష్టిసారించాలని' మహీంద్రా కోరారు. 
logo
>>>>>>