గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 11:14:09

బ్యాంకింగ్‌ వ్య‌వ‌స్థ సుర‌క్షితంగా, బ‌లంగా ఉంది..

బ్యాంకింగ్‌ వ్య‌వ‌స్థ సుర‌క్షితంగా, బ‌లంగా ఉంది..

హైద‌రాబాద్‌:  భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ సుర‌క్షితంగా, బ‌లంగా ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ అన్నారు.  ఇటీవ‌ల స్టాక్ మార్కెట్ల‌లో వ‌చ్చిన ప్ర‌కంప‌న‌లు బ్యాంకుల షేర్ల‌పై ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మార్కెట్లు డీలాప‌డ్డాయ‌న్నారు.  దీంతో కొంద‌రు డిపాజిట‌ర్లు బ్యాంకుల నుంచి డ‌బ్బును డ్రా చేసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  డిపాజిట్ల భ‌ద్ర‌త‌ను షేర్ల‌తో పోల్చ‌లేమ‌న్నారు. క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల డిపాజిట‌ర్లు ఆందోళ‌న చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని దాస్ అన్నారు. డిపాజిట‌ర్ల సొమ్ము భ‌ద్రంగా ఉన్న‌ట్లు తెలిపారు.  ప్రాంతీయ బ్యాంకుల‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు .. ఈఎంఐల‌పై మూడు నెల‌ల మారిటోయం పాటించ‌నున్న‌ట్లు చెప్పారు. క‌రోనా లాక్‌డౌన్‌తో భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ, స్టాక్‌మార్కెట్లు కొంద వ‌త్తిడికి లోనైట్లు చెప్పారు.  


logo