భారీ నష్టాల్లో భారత విమానయాన రంగం ...

Dec 05, 2020 , 12:48:04

ఢిల్లీ :కరోనా మహమ్మారి అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీనివల్ల ముఖ్యంగా ఆతిథ్య రంగం మరింతగా నష్టపోయింది. ఈ ఎఫెక్ట్ తో ఈ రంగం ఇప్పట్లో కోలుకునేటట్లు లేదట. ఇదే విషయాన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ తెలిపింది. ఫైనాన్సియల్ ఇయర్ 2020-21 ఇండియన్ ఎయిర్‌లైన్స్ రూ.21,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేసే అవకాశముందని ఆ సంస్థ వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి చివరి వారం నుంచి దాదాపు రెండు నెలలు విమాన ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఆ తర్వాత ప్రారంభమైనప్పటికీ పరిమితులకు లోబడి విమానాలను నడపాల్సి రావడంతో భారీనష్టాల్లో కూరుకుపోయేలా కనిపిస్తున్నది. ఆయా నష్టాలను పూడ్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీకి FY2021 నుంచి FY2023 మధ్య రూ.37,000 కోట్లకు పైగా ఫండ్ అవసరమని అభిప్రాయపడింది. 2020 మే 25వ తేదీ నుండి పరిమితంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత 45 శాతం కెపాసిటీతో అనుమతించారని, సెప్టెంబర్ నుండి 60 శాతం అమలులోకి వచ్చిందని గుర్తు చేసింది. నవంబర్ 11వ తేదీ నుండి 70 శాతం, డిసెంబర్ 3 నుండి 80 శాతం అనుమతించారని తెలిపింది.

కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడం, ప్రయాణాలు తగ్గడం వంటి వివిధ కారణాలతో భారీగా నష్టం వాటిల్లనుందన ఇక్రా తెలిపింది. FY2020లో ఇండియన్ ఎయిర్ లైన్స్ రూ.12,700 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి లీజు బాధ్యతలను మినహాయించి మొత్తం విమాన పరిశ్రమ రుణం దాదాపు రూ.50వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఇక్రా పేర్కొంది. ఇండిగో, స్పైస్ జెట్ విమాన సంస్థలు FY2021 మొదటి అర్ధ సంవత్సరంలో రూ.31 కోట్ల నష్టాలను రిపోర్ట్ చేశాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 62 శాతం నుండి 64 శాతం తగ్గవచ్చునని అంచనా వేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 88 శాతం నుండి 89 శాతం తగ్గవచ్చునని పేర్కొంది. 2020-21లో తక్కువ ప్రాతిపదికన కారణంగా 2021.22లో దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల వృద్ధి చాలా బలంగా కనిపించవచ్చని ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD