మంగళవారం 07 జూలై 2020
National - Jun 23, 2020 , 01:31:35

పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మృతి

పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మృతి

జమ్ము: జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం సోమవారం జరిపిన కాల్పుల్లో దీపక్‌ కర్కీ అనే సైనికుడు మరణించాడు. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)తోపాటు పూంచ్‌ జిల్లాలో కృష్ణఘాటీ, కథువా జిల్లాలోని హీరా సెక్టార్ల పరిధిలో పాక్‌ సైన్యం, రేంజర్లు ఫార్వర్డ్‌ ప్రాంతాలు, ఆర్మీ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. భారత్‌ కూడా ధీటుగా బదులిచ్చింది.


logo