సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 07:15:06

బఫర్‌ జోన్‌ కాదు.. గస్తీ రద్దు మాత్రమే

బఫర్‌ జోన్‌ కాదు.. గస్తీ రద్దు మాత్రమే

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బఫర్‌ జోన్లు ఏమీ లేవని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మళ్లీ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు మాత్రమే బలగాలను ఎల్‌ఏసీకి దూరంగా తరలించాలని నిర్ణయించినట్టు తెలిపాయి. 

సరిహద్దు వెంట పెట్రోలింగ్‌ను మాత్రమే తాత్కాలికంగా రద్దుచేసినట్టు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లఢక్‌ సహా పశ్చిమ సరిహద్దుల్లో ఎల్‌ఏసీ వెంట ఇరుదేశ సైన్యాలు ముఖాముఖి మోహరించి ఉండటంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నది. ఈ పరిస్థితిని నివారించేందుకే ఇరువైపుల సైనిక బలగాలను ఎల్‌ఏసీకి దాదాపు 600 మీటర్లు వెనక్కి తరలించినట్టు సమాచారం.


logo