శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 01:24:13

జవాన్లకు శీతాకాల సామగ్రి

జవాన్లకు శీతాకాల సామగ్రి

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో భారత సైన్యం అప్రమత్తమయింది. రానున్న శీతాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వచ్చే శీతాకాలంలో సరిహద్దుల్లో సైనికుల మోహరింపును కట్టుదిట్టం చేయటంతోపాటు, ఆ సమయంలో వారి రక్షణ కోసం సామగ్రిని ముందస్తుగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, రష్యా, ఐరోపా దేశాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లోని రక్షణ విభాగాలతో సంప్రదింపులను జరుపుతున్నది. వెచ్చటి దుస్తులు, మంచులో కూడా తట్టుకునే టెంట్లను తయారు చేసే సంస్థల వివరాలను సేకరించి అందించాలని ఆయా దేశాల భారత అధికారులకు చెప్పినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. సాల్తోరో శిఖరం, సియాచిన్‌ హిమనీనదం, పర్తాపూర్‌ ప్రాంతాల్లో మోహరించే సైనికుల కోసం స్థానికప్రజలు తయారు చేసే ఉత్పత్తులను కూడా వాడుతామని వివరించారు.


logo