సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 17:59:11

ఆర్మీలో స‌రికొత్త మొబైల్ యాప్‌

ఆర్మీలో స‌రికొత్త మొబైల్ యాప్‌

న్యూఢిల్లీ: భార‌త ఆర్మీ స‌రికొత్త మొబైల్‌ అప్లికేష‌న్‌ను ప్రారంభించింది. ఆర్మీకి సంబంధించిన ర‌హస్య స‌మాచారం లీకేజీకి అవ‌కాశం లేకుండా ఇండియ‌న్ ఆర్మీయే ఈ మొబైల్ అప్లికేష‌న్‌ను స్వ‌తహాగా అభివృద్ధి చేసి లాంచ్ చేసింది. సెక్యూర్ అప్లికేష‌న్ ఫ‌ర్ ది ఇంట‌ర్నెట్ (SAI) పేరుతో ఈ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఉప‌యోగించి ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి టెక్ట్స్‌, వాయిస్‌, వీడియో మెసేజ్‌ల‌ను పంపుకోవ‌చ్చు. 

ఇంటెలిజెన్స్ సంస్థ‌లపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే ఎలాంటి స‌మాచారం లీకేజీకి అవ‌కాశం లేకుండా ఈ నూత‌న యాప్‌ను రూపొందించార‌ని ర‌క్ష‌ణశాఖ తెలిపింది. ఈ మేర‌కు భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ యాప్ వాట్సాప్‌, టెలీగ్రామ్‌, సంవాద్‌, జిమ్స్ యాప్‌ల మాదిరిగానే స‌మాచార ర‌వాణాకు ఉప‌యోగ‌పడుతంద‌ని, అయితే దానిలోని సెక్యూరిటీ ఫీచ‌ర్స్ మాత్రం ఆర్మీ ఇన్ హౌస్ స‌ర్వ‌ర్‌కు లింక్ అయి ఉంటాయ‌ని ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. 

కాగా, ఈ కొత్త యాప్‌ను రాజ‌స్థాన్‌లోని సిగ్నల్స్ యూనిట్‌కు క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న‌సాయి శంక‌ర్ అభివృద్ధి చేశారు. అనంత‌రం దానిలో మిలిట‌రీ ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లుగా మార్పులు చేశారు. ఈ యాప్ ప‌నితీరును స‌మీక్షించిన అనంత‌రం ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క‌ల్న‌ల్ శంక‌ర్‌ను అభినందించారు. క‌ల్న‌ల్ శంక‌ర్ అద్భుత‌మైన నైపుణ్యం, బుద్ధి కుశ‌ల‌త‌తో యాప్‌ను రూపొందించార‌ని కొనియాడారు. ( చూడండి : ఆ కోట ఇలా కూలిపోయింది..వీడియో )


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.