బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 23:28:26

పాక్‌ కాల్పుల ఉల్లంఘన.. భారత్‌ ప్రతీకారం.. ట్రూపర్‌ మృతి

పాక్‌ కాల్పుల ఉల్లంఘన.. భారత్‌ ప్రతీకారం.. ట్రూపర్‌ మృతి

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడంతో భారత సైన్యం ప్రతీకార దాడులతో ఓ పాక్‌ ఆర్మీ ట్రూపర్‌ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారు. పాకిస్థాన్ ఆర్మీ పదేపదే కాల్పులు జరుపుతూ, పలు చోట్ల జమ్మూకశ్మీర్‌లోని పలు గ్రామాల వైపు కాల్పులు జరిపి ఉల్లంఘనకు పాల్పడుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి. హజీపీర్, పూంచ్, చమ్బ్, రఖ్ చిక్రీ సెక్టార్లలో పాక్‌ కాల్పులకు భారత సైన్యం సోమవారం ఎదురుదాడులు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘ఇందులో పాక్‌ సైనికుడితో పాటు ఎనిమిది గాయపడ్డారు’ అని సీనియర్‌ ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీంబర్‌లో పాక్ సైనికుడు మృతి చెందగా, పాక్ సైనికులకు గాయాలు హజీపీర్లో చోటు చేసుకున్నాయని, అక్కడ ఒక పాకిస్థాన్‌ జవాన్‌ గాయపడ్డాడని తెలిపారు. పూంచ్‌లో మరో ఐదుగురు పాక్‌ సైనికులు, రఖ్ చిక్రీ, పధర్‌ ప్రాంతాల్లో ఒక్కొక్కరు గాయపడ్డారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఎల్‌ఏసీ వెంట పాక్‌ పలు ఆయుధాలు, మోర్టార్లను ప్రయోగిస్తుందని, వరుసగా ఏడోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిందని ఆర్మీ ఆఫీసర్‌ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపేటప్పుడు పాకిస్తాన్‌ తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలను ఆశ్రయిస్తుందని, అయితే భారత సైన్యం గట్టి ప్రతీకారంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది.

‘జైష్-ఏ-మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను కశ్మీర్‌లోకి మరింత మందిని పంపేందుకు పాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సెక్టార్‌, ఎల్‌ఓసీని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని సీనియర్‌ ఆర్మీ అధికారి పేర్కొన్నారు. ‘ఈ ఏడాది కశ్మీర్‌లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్‌ దాడులకు తెగబడుతూ.. ఈ ప్రాంతంలో ప్రశాంతను చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత్‌ తిప్పికొడుతుందని’ ఆయన తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo