ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 16:17:20

చైనా సరిహద్దులో.. ‘భారత్’ డ్రోన్ల నిఘా

చైనా సరిహద్దులో.. ‘భారత్’ డ్రోన్ల నిఘా

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ డ్రోన్లతో నిఘా పెట్టనున్నది. దీని కోసం ‘భారత్’ పేరుతో దేశీయంగా తయారు చేసిన డ్రోన్లను ఆర్మీకి డీఆర్డీవో అందజేసింది. తూర్పు లఢక్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పర్వత ప్రాంతాల్లో చైనా ఆర్మీ కదలికలపై ఈ డ్రోన్ల సహాయంతో ఖచ్చితమైన నిఘా ఉంచుతారు.

చండీగఢ్‌లోని డీఆర్డీవో ల్యాబరేటరీలో ఈ డ్రోన్లను తయారు చేశారు. ‘భారత్’ పేరుతో దేశీయంగా తయారు చేసిన ఈ తేలికపాటి డ్రోన్లలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఎవరు స్నేహితులు, ఎవరు శ్రతువులో అన్నది కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ డ్రోన్ల ఉనికిని రాడార్లు కూడా గుర్తించలేవు.

ఈ డ్రోన్లు లైవ్ వీడియోలను కూడా పంపుతాయని, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తాయని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో చేపట్టిన మిడతల దండు నివారణ చర్యల్లోనూ వీటిని వినియోగించినట్లు వెల్లడించాయి.



logo