గురువారం 04 జూన్ 2020
National - May 20, 2020 , 13:45:30

స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల‌పై చైనా ఆరోప‌ణ‌లు..

స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల‌పై చైనా ఆరోప‌ణ‌లు..

హైద‌రాబాద్‌: సిక్కింలోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఇటీవ‌ల భార‌త‌, చైనా బ‌ల‌గాలు బాహాబాహీకి దిగిన విష‌యం తెలిసిందే. దీనిపై చైనా అధికారిక ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది. భార‌తీయ సైనికులు త‌మ స‌రిహ‌ద్దును దాటార‌ని చైనా ఆరోపించింది. త‌మ పెట్రోలింగ్ వాహ‌నాల‌ను కూడా భార‌త్ అడ్డుకున్న‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో చైనా విమ‌ర్శ‌లు చేసింది. నియంత్ర‌ణ రేఖ‌ను మార్చేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోపించింది.  సైనో ఇండియ‌న్ బోర్డ‌ర్‌తో పాటు సిక్కిం ప్రాంతంలో ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న‌ట్లు చైనా విదేశాంగ శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  ఈ విష‌యాన్ని ఇండియాతో చ‌ర్చించిన‌ట్లు చైనా అధికారులు తెలిపారు. చైనా చేసిన తాజా ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త విదేశాంగ శాఖ స్పందించ‌లేదు.  ల‌డాక్‌తో పాటు సిక్కింలో రెండు దేశాల జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్న‌ట్లు ఇటీవ‌ల భార‌త ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే పేర్కొన్న విష‌యం తెలిసిందే. 


logo