శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 26, 2020 , 07:33:58

నేటి నుంచి ఇండియ‌న్ ఆర్మీ క‌మాండ‌ర్ల భేటీ

నేటి నుంచి ఇండియ‌న్ ఆర్మీ క‌మాండ‌ర్ల భేటీ

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త సైన్యం క‌మాండ‌ర్లు స‌మావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న స‌మావేశాల్లో ఆర్మీ ఉపఅధిపతి, క‌మాండ‌ర్లు, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా స‌రిహ‌ద్దుల్లోని తూర్పు ల‌ఢ‌క్‌లో తాజా ప‌రిస్థితులు, వ్య‌యాల త‌గ్గింపున‌కు వ‌స్తున్న ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించనున్నారు. 

ఇవాళ మాన‌వ వ‌న‌రుల అంశంపై చ‌ర్చించ‌నున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ భేటీలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న రేపు ప్ర‌సంగిస్తార‌ని చెప్పారు. ‌చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సైనిక క‌మాండ్ల భేటీకి ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.