బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 12:32:01

వైర‌స్‌పై పోరు.. ఆప‌రేష‌న్ న‌మ‌స్తే

 వైర‌స్‌పై పోరు.. ఆప‌రేష‌న్ న‌మ‌స్తే

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  ఆ వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే మ‌న దేశం లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది.  అన్ని రాష్ట్రాలు వైర‌స్ నియంత్ర‌ణ‌కు తమ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.  భార‌తీయ ఆర్మీ కూడా క‌రోనా వైర‌స్‌పై పోరు చేప‌ట్టింది.  దీని కోసం చేపట్టిన ఆప‌రేష‌న్‌కు కొత్త పేరును పెట్టింది.  కోవిడ్‌19 ఆప‌రేష‌న్స్‌కు ఆప‌రేష‌న్ న‌మ‌స్తే అన్న పేరును సూచించారు.  ఆప‌రేష‌న్ న‌మ‌స్తే పేరుతో భార‌తీయ సైనిక ద‌ళం అన్ని ఆప‌రేష‌న్స్ చేప‌డుతుంది.  దేశ‌వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో క్వారెంటైన్ కేంద్రాల‌ను ఆర్మీ ఏర్పాటు చేసింది. 


logo