గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 11:06:59

టీ-90 భీష్మ‌.. బ్ర‌హ్మోస్ లాంచ‌ర్‌..పినాకా రాకెట్

టీ-90 భీష్మ‌.. బ్ర‌హ్మోస్ లాంచ‌ర్‌..పినాకా రాకెట్

న్యూఢిల్లీ:  72వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు ఢిల్లీలోని రాజ్‌ప‌థ్‌లో ఘ‌నంగా జ‌రిగాయి.  సైనిక ద‌ళాలు త‌మ స‌త్తాను చాటాయి.  ఇండియ‌న్ ఆర్మీకి చెందిన టీ-90 భీష్మ యుద్ధ ట్యాంక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  ప‌రేడ్ సంద‌ర్భంగా టీ-90 భీష్మ‌ను ప్ర‌ద‌ర్శించారు. 54వ రెజిమెంట్‌కు చెందిన‌ కెప్టెన్ క‌ర‌ణ్‌వీర్ సింగ్ భంగూ .. ట్యాంక్‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  ప‌రేడ్‌లో బంగ్లాదేవ్ ఆర్మీ బ్యాండ్ కూడా పాల్గొన్నది.  లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ అబూ మొహ‌మ్మ‌ద్ షానూర్ షావ‌న్ నేతృత్వంలో ఈ బ్యాండ్ ర్యాలీ తీసింది. తొలిసారి బంగ్లా బ్యాండ్ పాల్గొన్నది. దీంట్లో 122 మంది స‌భ్యులు ఉన్నారు.  

బ్ర‌హ్మోస్ మిస్సైల్‌కు చెందిన ఆటోన‌మిస్ లాంచ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు.  కెప్టెన్ ఖ‌మ్రుల్ జ‌మాన్ నేతృత్వంలో బ్ర‌హ్మోస్‌ను ప్ర‌జెంట్ చేశారు.  ఇండియా, ర‌ష్యా దేశాలు సంయుక్తంగా ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేశాయి.  400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను బ్ర‌హ్మోస్ చేధించ‌గ‌ల‌దు. 841 రాకెట్ రెజిమెంట్‌కు చెందిన పినాకా మ‌ల్టీ లాంచ‌ర్ రాకెట్ సిస్ట‌మ్‌ను  ప‌రేడ్‌లో ప్ర‌ద‌ర్శించారు.  కెప్టెన్ విభోర్ గులాటీ ఈ టీమ్‌ను లీడ్ చేశారు.  214 ఎంఎం పినాకా ఎంబీఆర్ఎల్‌.. అడ్వాన్స్‌డ్ రాకెట్ సిస్ట‌మ్‌. ఇది సంపూర్ణంగా ఆటోమెటిక్ లాంచ‌ర్‌.  అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఈ రాకెట్ ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 

VIDEOS

logo