భారత్ ఆర్మీ కస్టడీలో చైనా సైనికుడు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఒక సైనికుడ్ని భారత్ ఆర్మీ పట్టుకున్నది. లఢక్ సరిహద్దులోని దక్షిణ పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలో ఈ నెల 8న భారత్ వైపు ఎల్ఏసీ వద్ద కనిపించిన పీఎల్ఏ సైనికుడ్ని అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత జవాన్లు కస్టడీలోకి తీసుకున్నారు. చైనా సైనికుడు భారత్ వైపునకు ఎందుకు వచ్చాడు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత నిబంధనలు, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. పీఎల్ఏ సైనికుడు తమ అదుపులో ఉన్న విషయాన్ని చైనాకు తెలిపారు.
గత ఏడాది జూన్లో తూర్పు లఢక్ సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతోసహా 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాటి నుంచి లఢక్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలు తమ సైనిక దళాలను భారీగా మోహరించాయి.
కాగా, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా మధ్య సైనిక, దౌత్య స్థాయిల్లో పలు విడతలుగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ బలగాలను వెనక్కి మళ్లించడంపై ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు
- ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ధ్యేయం
- 55 బ్లాక్ స్పాట్లు
- ఉగాది నాటికి ‘డబుల్' ఇండ్లు ఇస్తాం
- నియోజక వర్గంలోని అన్ని చౌరస్తాలు అభివృద్ధి
- అంతర్గత రోడ్లకు కొత్తరూపు
- మంచుకొండ.. అభినందనీయం
- అభవృద్ధి పనులు వేగవంతం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
- రోడ్డు విస్తరణకు సన్నాహాలు
- ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’