మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 01:45:46

సిక్కింలో కొత్త లొల్లి! కొట్టుకున్న భారత్‌-చైనా జవాన్లు

సిక్కింలో కొత్త లొల్లి! కొట్టుకున్న భారత్‌-చైనా జవాన్లు

న్యూఢిల్లీ, జూన్‌ 22: గల్వాన్‌లో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగకముందే సిక్కింలో ఇరుదేశాల సైనికులు గొడవ పడినట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ఓ భారత జవాను చైనా సైనికుడిని కొడుతుండగా, సైనికులు ఒకరినొకరు తోసుకుంటున్నట్టు ఉన్నది. ‘వెనక్కు వెళ్లండి.. గొడవ వద్దు..’ అన్న మాటలు వీడియోలో వినిపిస్తున్నాయి. దెబ్బలు తిన్న చైనా సైనికుడి గురించి భారత అధికారి అడుగుతున్నది కూడా రికార్డు అయింది.  ఈ వీడియో ఎప్పుడు తీశారన్న కచ్చితమైన సమాచారం  లేకున్నా.. గల్వాన్‌ ఘర్షణ తర్వాత, మిలిటరీ చర్చలు జరుగుతున్న సమయంలోనే తీసిందని తెలుస్తున్నది. జూన్‌ 6న జరిగిన చర్చల్లో సరిహద్దు విషయంలో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. గల్వాన్‌ ఘర్షణ తర్వాత సోమవారం తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి.


logo