గురువారం 04 జూన్ 2020
National - Apr 06, 2020 , 14:24:13

మర్క‌జ్‌కు వెళ్లిన ఎయిర్‌ఫోర్స్ స‌ర్జెంట్‌.. క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌

మర్క‌జ్‌కు వెళ్లిన ఎయిర్‌ఫోర్స్ స‌ర్జెంట్‌.. క‌రోనా ప‌రీక్ష‌లో నెగ‌టివ్‌

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జ‌రిగిన మ‌ర్క‌జ్ స‌మావేశాల‌కు భార‌త వాయు సేన‌కు చెందిన ఓ స‌ర్జెంట్ హాజ‌ర‌య్యాడు. అయితే అత‌నికి వాయు ద‌ళం క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టింది. తొలి ప‌రీక్ష‌లో అత‌ను నెగ‌టివ్‌గా తేలిన‌ట్లు వాయు సేన అధికారులు వెల్ల‌డించారు. అయితే ప్రోటోకాల్ ప్ర‌కారం మ‌రికొన్ని సార్లు కూడా అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. ముంద‌స్తు చ‌ర్య‌గా ఆ స‌ర్జెంట్‌ను క్వారెంటైన్‌లో పెట్టిన‌ట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెల్ల‌డించారు. త‌బ్లిగీ జ‌మాత్ జ‌రిగిన స‌మ‌యంలో నిజాముద్దీన్‌లో స‌ర్జెంట్ తిరిగాడ‌ని, కానీ అత‌ను ఆ స‌మావేశాలకు హాజ‌రైన విష‌యం గురించి తెలియ‌ద‌ని అధికారులు చెప్పారు. ఢిల్లీలో అత‌నితో పాటు ఉంటున్న ఇత‌ర సిబ్బందిని కూడా క్వారెంటైన్ చేసిన‌ట్లు పేర్కొన్నారు.


logo