గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 14:54:40

లేహ్‌లో యుద్ధ హెలికాప్ట‌ర్ల‌ గ‌స్తీ..

లేహ్‌లో యుద్ధ హెలికాప్ట‌ర్ల‌ గ‌స్తీ..

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ప్ర‌స్తుతం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన సైనిక ఘ‌ర్ష‌ణ ఘ‌ట‌న త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది.  ఈ నేప‌థ్యంలో భార‌త వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ హెలికాప్ట‌ర్లు, విమానాలు గ‌స్తీ నిర్వ‌హిస్తున్నాయి.  లేహ్‌లో సైనిక హెలికాప్ట‌ర్లు నిఘా పెడుతూ .. సార్టీలు నిర్వ‌హిస్తున్నాయి. చైనాతో వాస్త‌వాధీన రేఖ వెంట ప్ర‌స్తుతం ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉన్న నేప‌థ్యంలో భార‌త వైమానిక ద‌ళం త‌న గ‌స్తీని పెంచింది. ఇవాళ ఉద‌యం చినూక్ హెలికాప్ట‌ర్లు ప‌హారా కాశాయి.

ల‌డ‌న్ ప‌రిస్థితిని వివ‌రించేందుకు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌..  ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే క‌లిశారు. ల‌డ‌ఖ్‌లో ఉన్న ప‌రిస్థితిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో రెండు రోజుల పాటు న‌ర‌వాణే ప‌ర్య‌టించారు. వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న ఫార్వ‌ర్డ్ ప్రాంతాల‌ను ఆయ‌న విజిట్ చేశారు.

ర‌క్ష‌ణ‌శాఖ మాజీ స‌హాయ‌మంత్రి ప‌ల్లెంరాజు.. చైనాతో నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న‌పై త‌న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు.  త‌మ‌కు ఉన్న స‌మాచారం మేర‌కు.. దీప్‌సంగ్ ప్రాంతంలో చైనా సైనికులు సుమారు 18 కిలోమీట‌ర్ల భూభాగాన్ని ఆక్ర‌మించిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని బాటిల్ నెక్ లేదా వై జంక్ష‌న్ అంటారు.  ఇది నిజంగా ప్ర‌మాద‌క‌ర‌మే అని మాజీ మంత్రి ప‌ల్లెంరాజ్ తెలిపారు.logo