మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:05:43

ఒకే రోజు రికవరీ కేసులు 36,145

ఒకే రోజు రికవరీ కేసులు 36,145

  • 63.92 శాతానికి పెరిగిన రికవరీ రేటు
  • 2.31 శాతానికి  దిగొచ్చిన  మరణాలు

న్యూఢిల్లీ, జూలై 26: కరోనాపై భారత్‌ అత్యంత ప్రభావవంతంగా యుద్ధం చేస్తున్నది. వైరస్‌ కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇండియాలో కొవిడ్‌ మరణాల రేటు రోజురోజుకూ క్రమంగా పడిపోతున్నది. కరోనా బారి నుంచి కోలుకొని(రికవరీ) దవాఖానల నుంచి డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఫలితంగా యాక్టివ్‌, రికవరీ కేసుల మధ్య అంతరం పెరుగుతున్నది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల కన్నా రికవరీ కేసులు 1.89 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు కరోనా రోగులు వేగంగా కోలుకోవడం ఇటీవల మరో ఆశాజనకమైన పరిణామం. శనివారం నుంచి ఆదివారం ఉదయానికి 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 36,145 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని దవాఖానల నుంచి ఇంటికి వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,85,576కు పెరిగింది. ఇంకా 4,67,882 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో రికవరీ రేటు 63.92% శాతం ఉండగా, కొవిడ్‌ మరణాల రేటు 2.31 శాతానికి దిగివచ్చింది.


logo