శుక్రవారం 10 జూలై 2020
National - Feb 14, 2020 , 11:19:27

జవాన్ల బలిదానాన్ని దేశం ఎన్నటికీ మరవదు: ప్రధాని మోదీ

జవాన్ల బలిదానాన్ని దేశం ఎన్నటికీ మరవదు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్‌ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. గతేడాది జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారు దేశానికి సేవ చేయడానికి, దేశాన్ని రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు అన్నారు. భారతదేశం ఈ అమరులను ఎన్నటికి మరవదన్నారు.


logo