శుక్రవారం 03 జూలై 2020
National - Jan 23, 2020 , 15:11:33

ఢిల్లీలో ఎన్నికలు.. భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌

ఢిల్లీలో ఎన్నికలు.. భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్యనే పోటీ ఉంది. అయితే ఈ ఎన్నికలపై ఆప్‌ మాజీ నాయకుడు కపిల్‌ మిశ్రా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజున ఢిల్లీ వీధుల్లో భారత్‌, పాకిస్తాన్‌ పోటీ పడుతాయని కపిల్‌ మిశ్రా ట్వీట్‌ చేశారు. ఇక కపిల్‌ మిశ్రా నామినేషన్‌ను తిరస్కరించాలని ఆప్‌ నాయకులు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వసతులను ఉపయోగించుకున్న కపిల్‌ మిశ్రా.. తన నామినేషన్‌ పత్రాల్లో నీటి బిల్లు, కరెంట్‌ బిల్లు, ఫోన్‌ బిల్లులకు సంబంధించి నో డ్యూస్‌ సర్టిఫికెట్స్‌ జమ చేయలేదని ఆప్‌ నాయకులు తెలిపారు.

మొత్తానికి కపిల్‌ మిశ్రా, ఆప్‌ నేతలకు మధ్య కొద్దికాలం నుంచి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కపిల్‌ మిశ్రా గతేడాది ఆగస్టులో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆప్‌ మహిళా విభాగం చీఫ్‌ రిచాపాండేతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 


logo